TG Assembly: దొరల స్వార్ధం కోసం ధరణిని తీసుకొచ్చారు.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ఫైర్

దొరల స్వార్థం కోసమే గత ప్రభత్వం రాష్ట్రంలో ‘ధరణి’ (Dharani)ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఫైర్ అయ్యారు.

Update: 2024-12-20 08:26 GMT
TG Assembly: దొరల స్వార్ధం కోసం ధరణిని తీసుకొచ్చారు.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ఫైర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దొరల స్వార్థం కోసమే గత ప్రభత్వం రాష్ట్రంలో ‘ధరణి’ (Dharani)ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో భూ భారతి బిల్లు (Bhu Bharathi Bill)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేశామని అన్నారు. ధరణి (Dharani) పేరుతో కొల్లగొట్టిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఆ భూములను పేదలకు పంచుతామని అన్నారు. ఓఆర్ఆర్ లీజు (ORR Lease)ను రద్దు చేయాలని హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) కోరుతున్నారని.. ఓ అగ్రిమెంట్ రద్దు చేయాలంటే ముందుగా దానిపై విచారణ జరగాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ (BRS) సభ్యులు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) ఎప్పడూ సభకు రారని.. వాళ్ల సభ్యులేమో రౌడీలు, గుండాల్లా సభలో ప్రవర్తిస్తున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News