KTR: ‘తిట్టండి.. తిట్టండి.. ఇంకో రెండు గంటలు తిట్టండి’

అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-27 12:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువ మాట్లాడితే మాకు అంత మంచింది.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తిట్లే మాకు దీవెనలు.. రేవంత్ రెడ్డి తిట్ల వల్ల ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలో, హర్యానాలో, ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రచారాలు చేశాడు. మొన్న రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాలు చేశాడు. అద్భుతాలు సాధించాడు’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీని, తమను ఎంత తిట్టాలనుకున్నా.. ఈ ఐదేళ్లే అని.. అందుకే ఇంకో రెండు గంటలు తిట్టినా తమకే ఫరక్ పడదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన హామీలు, అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలపై నిలదీసే హక్కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఉందని కేటీఆర్ తెలిపారు. అంతకుముందు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లిన అంశంపై కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్య‌మం చేసి జైలుకు పోయిండా..? ఏం చేసి పోయిండు ఆయ‌న జైలుకు..? సానుభూతి ఎందుకు..? ఉద్యమ సమయంలో తాము కూడా జైలుకు వెళ్లామని కేటీఆర్ తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీద డ్రోన్ ఎగరేసి.. భార్యా, బిడ్డల్ని ఫొటోలు తీస్తుంటే ఊరుకోవాలా? అని మండిపడ్డారు.

Tags:    

Similar News