Tomato Prices : టమాటా రైతులకు కన్నీళ్ళు.. కిలో రూ.3
టమాటా(Tomato) పంట రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : టమాటా(Tomato) పంట రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో టమాటా(Tomato Prices) ధరలు భారీగా పడిపోవడంతో కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హోల్ సేల్ గా కిలో రూ. 3 మాత్రమే పలుకుతుండటంతో చేసేదేమి లేక రోడ్ల పక్కన పారేసి వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్తికి చెందిన ఓ రైతు ఒక్కోటి 30 కేజీల 56 టమాటా పెట్టెలను మహబూబ్ నగర్ రైతు బజార్ కు తీసుకు వెళ్ళగా.. దళారులు 39 పెట్టెలకు కేవలం రూ.3900 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో రోడ్డు పక్కన పారవేశాడు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రాలేదని రైతు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మరోవైపు బహిరంగ మార్కెట్లో కేజీ టమాటా రూ.20 నుంచి 30 పలుకుతోంది. అయితే ఏపీ నుంచి అత్యధికంగా టమాటా దిగుమతి అవుతుండటంతో తెలంగాణలో టమాటా రేట్లు దారుణంగా పడిపోయి.. ఇక్కడి రైతుల వద్ద కొనేవారు కరువయ్యారు.