Cabinet Expansion: కేబినెట్ విస్తరణ వేళ అనూహ్య పరిణామం.. అధిష్టానానికి ఆ జిల్లా ఎమ్మెల్యేల లేఖ

రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ (Cabinet Expansion)పై ఊహగానాలు బలంగా వినిపిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Update: 2025-03-31 06:38 GMT
Cabinet Expansion: కేబినెట్ విస్తరణ వేళ అనూహ్య పరిణామం.. అధిష్టానానికి ఆ జిల్లా ఎమ్మెల్యేల లేఖ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ (Cabinet Expansion)పై ఊహగానాలు బలంగా వినిపిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉన్న నాలుగైదు మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు ఢిల్లీ (Delhi) స్థాయిలో తమ శక్తి మేర లాబీయింగ్ చేస్తున్నారు. ఈ కమ్రంలోనే రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)కు చెందిన ఎమ్మెల్యేలు అంతా కలిసి కేబినెట్‌లో‌‌ తమకు బెర్త్ కల్పించాలంటూ కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో తమ జిల్లాకు ప్రాతినిధ్యం లేదని, జిల్లా ప్రజలకు ప్రభుత్వంపై భరోసా కల్పించేందుకు ఇప్పటికైనా తమలో ఎవరో ఒకరికి కేబినెట్‌లో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధిష్టానానికి లేఖ రాసిన వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy), వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (Rammohan Reddy), తాండూరు ఎమ్మెల్యే మనోహరెడ్డి (Manohar Reddy) ఉన్నారు. త్వరలో వారు రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పాటు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ను కూడా కలుస్తామని పేర్కొన్నారు. అయితే ఆ లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతకం చేశారా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. 

కాగా, మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma)తో భేటీ అయిన నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఎవరెవరినీ తీసుకుంటారనే అధకార పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే నలుగురి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లుగా ప్రాథమికంగం తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్​జిల్లా నుంచి సుదర్శన్​రెడ్డి (Sudharshan Reddy), నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), మహబూబ్​నగర్​జిల్లా నుంచి వాకిటి శ్రీహరి (Vakiti Srihari), ఆదిలాబాద్​జిల్లా నుంచి గడ్డం వివేక్‌‌ (Gaddam Vivek)కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అన్ని అనుకన్నట్లుగా జరిగితే ఎప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుందని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News