Harish Rao : ప్లీజ్ మద్ధతివ్వండి..ఎంఐఎం ఎమ్మెల్యేలకు హరీష్ రావు అభ్యర్థన

శాసన సభ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao )అనూహ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యేల(MIM MLAs)ను కలిశారు.

Update: 2024-12-20 08:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : శాసన సభ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao )అనూహ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యేల(MIM MLAs)ను కలిశారు. ఫార్ములా ఈ రేసు కేసు వివాదంలో అసెంబ్లీ చర్చకు డిమాండ్ చేస్తున్న విషయమై మాకు మద్ధతునివ్వాలని అభ్యర్థించారు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ సహా ఇతర ఎమ్మెల్యేలను హరీష్ రావు కలిసి మద్ధతు కోరారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం ప్రస్తుతం కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికి.. కొన్ని అంశాల్లో విభేధిస్తుంది. ఈ క్రమంలో హరీష్ రావు అభ్యర్థన పట్ల ఎంఐఎం ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఫార్ములా-ఈ కార్‌ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్‌పై కేసు పెట్టారని, ఈ వివాదంపై ఆయనకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని హరీశ్‌ రావు స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ నిరాకరించడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భూ భారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు. అయితే ఫార్ములా రేస్‌పై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే స్పీకర్‌ పోడియం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఘటనలు వివాదస్పదమయ్యాయి. 

Tags:    

Similar News