Kharge: రైతులకు ద్రోహం చేయడం దేశ ద్రోహమే.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
రైతులకు ద్రోహం చేయడం అంటే దేశ ద్రోహమే అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress National President Mallikarjun Kharge) స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: రైతులకు ద్రోహం చేయడం అంటే దేశ ద్రోహమే అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress National President Mallikarjun Kharge) స్పష్టం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ ద్లలేవాల్(Jagjit Singh Dallewal) నిరాహార దీక్ష(hunger Strike) చేస్తున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఖర్గే.. మోడీ ప్రభుత్వంపై(Modi Government) సంచలన విమర్శలు(Criticisms) చేశారు. ఈ సందర్భంగా.. మోడీ(PM Modi).. మీ రైతు వ్యతిరేక విధానాలు, మొండితనం, అబద్ధపు వాగ్దానాల వల్ల మాకు అన్నం పెట్టే మా రైతులు(Farmers) మీ ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని వేడుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవాలని చెప్పారు.
అలాగే దేశాన్ని పోషించడం వల్ల రైతులకు ఆత్మగౌరవం ఉంటుందని, ఈసారి లాఠీ-బాజీ(lathi-charge), టియర్ గ్యాస్(Tear Gas), రబ్బర్ బుల్లెట్లు(Rubber Bullets), ఆందోళనకారుడు(Agitator), పరాన్నజీవి(Parasite) లాంటి దూషణ పదాలు పనిచేయవని ఎద్దేవా చేశారు. అంతేగాక రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణించడం చాలా ఆందోళన కలిగించే విషయమని, ఆమరణ నిరాహార దీక్షను ముగించి చర్చల మార్గాన్ని అనుసరించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక మీరు మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవలసి వచ్చినప్పుడు, ఎమ్ఎస్‌పీ(MSP)కి చట్టపరమైన హోదా కల్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మీరు ప్రకటించారని గుర్తుచేశారు. ఆ హామీ ఏమైందో దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రైతులే దేశానికి వెన్నెముక అని, వారికి ద్రోహం చేయడం దేశ ద్రోహం కిందికే వస్తుందని మర్చిపోవద్దు! అని ఖర్గే రాసుకొచ్చారు.