Padi Koushik Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారు : పాడి కౌశిక్ రెడ్డి

లండ‌న్‌లో ఫార్ములా ఈ రేసింగ్(Formula E Racing) సంస్థపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కేసు వేయ‌డం వలన రాష్ట్ర ప‌రువు అంత‌ర్జాతీయంగా పోయింద‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy) ధ్వజ‌మెత్తారు.

Update: 2024-12-20 13:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : లండ‌న్‌లో ఫార్ములా ఈ రేసింగ్(Formula E Racing) సంస్థపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కేసు వేయ‌డం వలన రాష్ట్ర ప‌రువు అంత‌ర్జాతీయంగా పోయింద‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy) ధ్వజ‌మెత్తారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదని.. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే స్పీకర్ పోడియంలోకి వెళ్లామని, మాపై మార్షల్స్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడుల‌కు పాల్పడ్డారని వెల్లడించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే చెప్పు చూయించిన వీడియో కూడా బయట పెట్టాలని, మా ఆందోళ‌న‌లను మాత్రమే బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌డం స‌రికాదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డైవ‌ర్షన్ రాజ‌కీయాలు చేస్తున్నారని తెలిపిన కౌశిక్ రెడ్డి.. ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించి కాంట్రాక్టు ఉల్లంఘన కేసు పెట్టడం రాష్ట్రానికి అవమానమని పేర్కొన్నారు. అసలు కేటీఆర్‌(KTR)పై పెట్టిన కేసు అక్రమ కేసని, అది కోర్టులో కొట్టివేయబడుతుందని తెలియజేశారు. 

Tags:    

Similar News