BRS: డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అక్రమ కేసులు.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ కేసులు(False Cases) పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్(BRS MLA KP Vivekanand Goud) ఆరోపించారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ కేసులు(False Cases) పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్(BRS MLA KP Vivekanand Goud) ఆరోపించారు. శాసనసభలో(Telangana Assembly) మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party)పైన కక్ష గట్టి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(BRS Working President KTR) పై ఏసీబీ(ACB)తో కేసు నమోదు చేయించారని అన్నారు.
పదే పదే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. వైఫల్యాలను ఎత్తిచూపుతున్నామని డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics) లో భాగంగా అక్రమ కేసులు మోపుతున్నారని, బీఆర్ఎస్ చేసిన అన్ని పనులపై విచారణ పేరుతో ఐదేళ్లు పబ్బం గడపాలని చూస్తున్నారని ఆరోపించారు. శాసన సభ సభ్యులుగా మా హక్కు ప్రకారం అసెంబ్లీలో చర్చ జరగాలని స్పీకర్(Speaker) ని కోరితే.. అసెంబ్లీ వేదికగా మా హక్కులను కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై బహిరంగంగా చర్చ జరపాలని కోరుతుంటే.. ప్రభుత్వానికి ధైర్యం లేక మాపై దాడి చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. చర్చ జరగాలని పట్టుబడితే.. మాపై కాంగ్రెస్ సభ్యులు బాటిళ్లు, చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, అసెంబ్లీ చరిత్రలో ఎన్నడు లేని దుర్మార్గమైన చర్యలను ఇప్పుడు చూస్తున్నామని వివేకానంద్ ఫైర్ అయ్యారు.