JPC : జమిలి జేపీసీలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కు చోటు

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు(One Nation One Election Bill)పై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ(JPC) లో తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్(MP Dr. K. Laxman)కు చోటు లభించింది.

Update: 2024-12-20 07:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు(One Nation One Election Bill)పై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ(JPC) లో తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్(MP Dr. K. Laxman)కు చోటు లభించింది. ఏపీ నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియామితులయ్యారు. ముందుగా లోక్ సభ నుంచి 21మంది, రాజ్యసభ నుంచి 10మంది ఉంటారని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంలో మార్పులు చేస్తూ తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో లోక్ సభ నుంచి 27మంది, రాజ్యసభ నుంచి 12మంది ఉంటారని ప్రకటించింది. పెరిగిన జేపీసీ సభ్యుల జాబితాలో తెలంగాణ నుంచి డాక్టర్ కే.లక్ష్మణ్ కు స్థానం దక్కింది.

లోక్ సభ నుంచి కొత్తగా బీజేపీ నుంచి వైజయంత్ పండా(ఒడిశా), సంజయ్ జైశ్వాల్(బీహార్), చోటేలాల్ (యూపీ ఎస్పీ), అనిల్ యశ్వంత్ దేశాయ్(మహారాష్ట్ర, శివసేన యూబీటి), శాంభవి(ఎల్జేపీ రాంవిలాస్ బీహార్), కే.రాధాకృష్ణన్ (కేరళ సీపీఎం)లు ఉన్నారు. దీంతో జేపీసీలో బీజేపీ సభ్యుల సంఖ్య 12కు చేరింది. అటు రాజ్యసభ నుంచి ఘ్యాన్ శ్యామ్ తివారీ, భూభానేశ్వర్ కలిత, కే.లక్ష్మణ్, కవిత పటిదార్, సంజయ్ కుమార్ జా, రణదీప్ సింగ్ సుర్జీవాల, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్, సాకేతో గోఖలే, పి.విల్సన్, సంజయ్ సింగ్, మానస్ రంజన్ మంగరాజ్, వి.విజయసాయిరెడ్డిలు ఉన్నారు. జేపీసీకి ఒడిశాకు చెందిన బీజేసీ సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నేతృత్వం వహించే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News