కరోనాపై 9మంది సభ్యుల కమిటీ..

దిశ, అమరావతి ఏపీలో కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటం, ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి 9మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి కొనుగోళ్లు, ఇతర నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కరోనా కేసు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇప్పటికే ఏపీలో 11అనుమానిత కేసులు నమోదయ్యాయి.దీంతో అధికారులు వారి నుంచి నమూనాలు […]

Update: 2020-03-06 00:40 GMT

దిశ, అమరావతి
ఏపీలో కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటం, ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి 9మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి కొనుగోళ్లు, ఇతర నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కరోనా కేసు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇప్పటికే ఏపీలో 11అనుమానిత కేసులు నమోదయ్యాయి.దీంతో అధికారులు వారి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపారు.

Tags: ap govt appointed 9mem committee,carona,11 suspect cases

Tags:    

Similar News