మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ముట్టుకున్నాడు.. ప్రాణాలొదిలాడు
దిశ, కరీంనగర్: మద్యం మత్తు ఆ యువకుడిని బలిగొంది. మెదడును మొద్దుబారించిన మత్తు.. చివరికి ప్రాణాలను తీసింది. పూటుగా తాగి.. మద్యం నిషాలో ఆ యువకుడు నడిరోడ్డుపై చిందులు వేస్తూ.. రాళ్లు విసురుతూ.. ఎదురొచ్చినవాళ్లతో గొడవకు దిగాడు. నోటికొచ్చినట్టు అరుస్తూ విచిత్ర చేష్టలు చేశాడు. నడిరోడ్డుపై బండరాయిని పెట్టి.. పడుకున్నాడు. తర్వాత రోడ్డుపై నుంచి లేచి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లాడు. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకుని షాక్‌కు గురై ప్రాణాలొదిలాడు. ఈ దుర్ఘటన జగిత్యాల జిల్లా […]
దిశ, కరీంనగర్: మద్యం మత్తు ఆ యువకుడిని బలిగొంది. మెదడును మొద్దుబారించిన మత్తు.. చివరికి ప్రాణాలను తీసింది. పూటుగా తాగి.. మద్యం నిషాలో ఆ యువకుడు నడిరోడ్డుపై చిందులు వేస్తూ.. రాళ్లు విసురుతూ.. ఎదురొచ్చినవాళ్లతో గొడవకు దిగాడు. నోటికొచ్చినట్టు అరుస్తూ విచిత్ర చేష్టలు చేశాడు. నడిరోడ్డుపై బండరాయిని పెట్టి.. పడుకున్నాడు. తర్వాత రోడ్డుపై నుంచి లేచి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లాడు. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకుని షాక్‌కు గురై ప్రాణాలొదిలాడు. ఈ దుర్ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల నంది చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. విచిత్ర చేష్టలతో భయాందోళనలకు గురిచేసిన ఆ యువకుడిని కాపాడేందుకు స్థానికులు సాహసించలేకపోయారు. మతిస్థిమితాన్ని కోల్పోయినవాడిలా ప్రవర్తించిన ఆ యువకుడు మరణించడం స్థానికులను కలచివేసింది. అయితే, మృతి చెందిన యువకుడి వివరాలు తొలుత తెలియరాలేదు. కానీ, పోలీసులు వలస కూలీలు వివరాలను ఆరా తీయగా.. యువకుడి గురించిన సమాచారం లభించింది. మరణించిన యువకుడు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం, వెంగళాపూర్ గ్రామానికి చెందిన సుబ్బారాయుడు(35)గా పోలీసులు గుర్తించారు. కోరుట్లలో తాపీ మేస్త్రీగా పనిచేసేవాడని వివరించారు.