వ్యభిచార కూపం నుంచి యువతికి విముక్తి
దిశ, సిరిసిల్ల: తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్మాయిని పెంచుతామని మాయా మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపిన ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెంతిన యువతికి సిరిసిల్ల పోలీసుల చొరవతో విముక్తి లభించింది. యువతిని పోలీసుల సమక్షంలో ఆమె మామయ్యకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువతి తల్లిదండ్రులు మృతిచెందారు. ఈ సమయంలో ఆ యువతిని చదివించి తీర్చిదిద్దుతామని మాయ మాటలు చెప్పి ఓ […]
దిశ, సిరిసిల్ల: తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్మాయిని పెంచుతామని మాయా మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపిన ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెంతిన యువతికి సిరిసిల్ల పోలీసుల చొరవతో విముక్తి లభించింది. యువతిని పోలీసుల సమక్షంలో ఆమె మామయ్యకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువతి తల్లిదండ్రులు మృతిచెందారు. ఈ సమయంలో ఆ యువతిని చదివించి తీర్చిదిద్దుతామని మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి తీసుకెళ్లారు. అనంతరం ఆ యువతిని అమ్మేశారు. ఎన్నిరోజులు గడిచినా ఆ యువతి ఇంటికి రాకపోవడంతో బంధువులు బెల్లంపల్లి పోలీసులను ఆశ్రయించారు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, ఇటీవల సదరు యువతి తన మామయ్యకు ఫోన్ చేసి తాను సిరిసిల్లలో ఉన్నట్లు సమాచారం అందించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు ప్రేమ్ నగర్ లోని వ్యభిచార గృహంలో దాడులు నిర్వహించారు. అక్కడే ఉన్న ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు.