ప్రేమపేరుతో వంచన.. సహజీవనం చేసి చివరకు
దిశ, వెబ్‌డెస్క్ : యువకుల గాలానికి వలలో చిక్కిన చేపపిల్లలా ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులు మోసపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలానే ఓ యువతి ప్రాణంగా ప్రేమించి, అతనితో సహజీవనం చేసి చివరకు అతను ప్రేమించలే మోసం చేశాడని తెలుసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నిన్నెలా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిన్నెలా గ్రామానికి చెందిన మౌనిక అదే గ్రామానికి […]
దిశ, వెబ్‌డెస్క్ : యువకుల గాలానికి వలలో చిక్కిన చేపపిల్లలా ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులు మోసపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలానే ఓ యువతి ప్రాణంగా ప్రేమించి, అతనితో సహజీవనం చేసి చివరకు అతను ప్రేమించలే మోసం చేశాడని తెలుసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నిన్నెలా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిన్నెలా గ్రామానికి చెందిన మౌనిక అదే గ్రామానికి చెందిన అక్రమ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అక్రమ్ పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. అతనిని పూర్తిగా నమ్మిన మౌనిక కొన్ని రోజులు సహజీవనం కూడా చేసింది. ఆ తరవాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ముఖం చాటేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.