పెళ్లైన రెండు నెలలకే దారుణం.. రక్తపు మడుగులో యువతి.. ఏం జరిగింది.?
దిశ, హుజురాబాద్ : యువతిని గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన మ్యాధర ప్రవళిక( 21)కు బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్ (28)తో రెండు నెలల క్రితమే పెళ్లి జరిగింది. అయితే, ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం యువతి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ప్రవళిక( 21)ను దారుణంగా […]
దిశ, హుజురాబాద్ : యువతిని గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన మ్యాధర ప్రవళిక( 21)కు బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్ (28)తో రెండు నెలల క్రితమే పెళ్లి జరిగింది.
అయితే, ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం యువతి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ప్రవళిక( 21)ను దారుణంగా హత్య చేశారని స్థానికులు పేర్కొన్నారు. భర్త అనిల్ హుస్నాబాద్‌లో బ్యాటరీ షాపు నడుపుతున్నాడు. అనిల్ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టారు.
హత్య సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలాన్ని కరీంనగర్ సీపీ వి.బి. కమలాసన్ రెడ్డి, తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, చిగురు మామిడి ఎస్ఐ మధుకర్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభినట్టు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని సీపీ తెలిపారు.