మహిళలకు బెటర్ రోల్స్ సృష్టించాలి : యామి

దిశ, వెబ్‌డెస్క్ : ‘నువ్విలా, కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం, యుద్ధం’ లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ యామీ గౌతమ్‌.. సినిమాల్లో కన్నా యాడ్ ఫిలిమ్స్ ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాలీవుడ్ విషయానికొస్తే ‘విక్కీ డోనర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ.. తాజాగా ‘ఉరి, బాల, గిన్నీ వెడ్స్ సన్నీ’ చిత్రాల ద్వారా హిట్స్ అందుకుంది. అయితే ‘బాల’ చిత్రంలో టిక్ టాక్ స్టార్‌గా కనిపించి సూపర్ కామెడీ చేసిన యామి.. మహిళలకు ఇలాంటి […]

Update: 2020-11-05 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
‘నువ్విలా, కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం, యుద్ధం’ లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ యామీ గౌతమ్‌.. సినిమాల్లో కన్నా యాడ్ ఫిలిమ్స్ ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాలీవుడ్ విషయానికొస్తే ‘విక్కీ డోనర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ.. తాజాగా ‘ఉరి, బాల, గిన్నీ వెడ్స్ సన్నీ’ చిత్రాల ద్వారా హిట్స్ అందుకుంది.

అయితే ‘బాల’ చిత్రంలో టిక్ టాక్ స్టార్‌గా కనిపించి సూపర్ కామెడీ చేసిన యామి.. మహిళలకు ఇలాంటి పాత్రలు మరిన్ని దక్కితే బాగుంటుందని అభిప్రాయపడింది. కేవలం ఆఫ్ బీట్ సినిమా స్పేస్‌లో మాత్రమే కాకుండా, కమర్షియల్ సినిమాల్లోనూ మహిళలకు అలాంటి క్యారెక్టర్స్ ఇవ్వడం ద్వారా.. వాళ్లు కామెడీ క్యారెక్టర్స్ చేయకూడదు, చేయలేరన్న మూసధోరణికి బైబై చెప్పాలంది. కమర్షియల్ సినిమాలు, ఎమోషనల్ క్యారెక్టర్స్‌తో పాటు కామిక్ క్యారెక్టర్స్ చేసిన ఘనత ఒక్క శ్రీదేవి గారికి మాత్రమే దక్కిందన్న యామి.. ఇలాంటి మంచి పాత్రలు సృష్టించి ఇండస్ట్రీలో మహిళా సాధికారత గురించి చర్చిస్తే బాగుంటుందని తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత సక్సెస్ అందుకున్న యామి, తన లైఫ్‌లో ఎదురైన పరాజయాలే.. ప్రశంసలు, వైఫల్యాలు రెండింటినీ అంగీకరించగలిగే తత్వాన్ని అలవరుచుకునేలా చేశాయని చెప్పింది.

Tags:    

Similar News