UPSC Civils Interview: యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ తేదీలు విడుదల
దేశవ్యాప్తంగా ఐఏఎస్(IAS), ఐఎఫ్‌ఎస్(IFS), ఐపీఎస్(IPS) లాంటి సర్వీసులలో ఖాళీగా ఉన్న 1056 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఐఏఎస్(IAS), ఐఎఫ్‌ఎస్(IFS), ఐపీఎస్(IPS) లాంటి సర్వీసులలో ఖాళీగా ఉన్న 1056 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 2,845 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 90 మంది సెలెక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. సివిల్ సర్వీసెస్-2024(Civil Services-2024)కు సంబంధించి ఇంటర్వ్యూ(Interview) తేదీలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. 2025 జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలను కండక్ట్ చేయనున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల రూల్ నంబర్(Roll No), ఇంటర్వ్యూ తేదీ(Date), టైం(Time) వంటి వివరాలను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ లో పొందుపరిచింది. అభ్యర్థులు పూర్తి డీటెయిల్స్(Full Deatils) కోసం వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.