Swami Smaranananda: క్రియోయోగ ధ్యానంతో అత్యుత్తమ ఆధ్యాత్మిక ఫలితాలు..!
సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన క్రియో యోగ(Criyo Yoga) ధ్యాన సాధన ద్వారా ఆధ్మాత్మికంగా అత్యుత్తమ ఫలితాలు పొంద వచ్చని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద (Swami Smaranananda) తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన క్రియో యోగ(Kryo Yoga) ధ్యాన సాధన ద్వారా ఆధ్మాత్మికంగా అత్యుత్తమ ఫలితాలు పొంద వచ్చని యోగద్యాన సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద (Swami Smaranananda) తెలిపారు. ఆత్మసాక్షాత్కర మార్గం క్రియోయోగ ధ్యానం ద్వారా సులభతరమవుతుందని చెప్పారు. క్రియోయోగ ధ్యానానికి సంబంధించిన ప్రాధమిక విషయాలపై సికింద్రాబాద్(Secunderabad) ప్యారడైజ్ హోటల్(Paradise Hotel) సమీపంలోని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో ఈ నెల 21న(శనివారం) సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ప్రత్యేక ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నట్లు స్వామి స్మరణానంద వెల్లడించారు. భగవదన్వేషకులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ధ్యాన తరగతులను హాజరై ప్రయోజనం పొందాలని ఆయన పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాలకు 9666665328, 9866548484 నంబర్లకు ఫోన్ చేయవచ్చని వైఎస్ఎస్ హైదరాబాద్ మేనేజింగ్ కమిటీ మెంబర్ శశివదనా రెడ్డి తెలిపారు. ఈ క్రియాయోగ ధ్యాన తరగతులకు హాజరయ్యే వారు యోగదా సత్సంగ సొసైటీ క్రియోయోగ పాఠాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఆమె చెప్పారు.