పటాన్ చెరు లో దారుణం..కన్న కొడుకును చంపిన తండ్రి

పటాన్ చెరు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి సొంత కొడుకును కడతేర్చిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Update: 2024-12-20 14:36 GMT

దిశ,పటాన్ చెరు : పటాన్ చెరు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి సొంత కొడుకును కడతేర్చిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పాత కక్షలతో కన్న కొడుకును తండ్రి దారుణంగా హత్య చేసిన సంఘటన పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో చోటుచేసుకుంది. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ సిఐ స్వామి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన అత్తిల్లి అనంతరెడ్డి తన కుమారుడు అత్తెల్లి వెంకట్ రెడ్డి (35) నీ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో కర్రతో తలపై దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు వారు తెలిపారు. కన్న తండ్రి చేతిలోనే కొడుకు హత్య కావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కన్న తండ్రి కొడుకును దారుణంగా హత్య చేయడం పట్ల స్థానికలు ఉలిక్కిపడ్డారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ స్వామి గౌడ్ వెల్లడించారు.


Similar News