పుష్ప-2 చిత్రబృందానికి మరో BIG షాక్.. ఢిల్లీకి చేరిన సంధ్య థియేటర్ ఘటన కేసు
పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో సినిమా చూడ్డానికి వచ్చిన ఓ మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు శ్రీతేజ్(Sri Tej) కిమ్స్ ఆసుపత్రి(Kim's Hospital)లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సీరియస్‌గా తీసుకొని చిత్రబృందంతో పాటు హీరో, థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఒకరోజు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. తాజాగా.. ఈ కేసులో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాట ఘటనపై ఓ వ్యక్తి NHRCకి ఫిర్యాదు చేశారు. ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని.. పుష్ప-2 చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Read More...
Pushpa-2: బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ సరికొత్త రికార్డ్.. సెకండ్ ప్లేస్‌లో ఏ సినిమా అంటే?