టాప్‌లో సుశాంత్.. టెన్త్ ప్లేస్‌లో బన్నీ!

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మన మధ్య లేకపోయినా.. టాప్ ప్లేస్‌లో మాత్రం తనే ఉన్నాడు. 2020 ఎండింగ్‌కు చేరుకోవడంతో యాహూ రిలీజ్ చేసిన ‘మోస్ట్ సెర్చ్‌డ్ పర్సనాలిటీస్ 2020’ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. అంతేకాదు తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్‌తో పాటు బీటౌన్ సెలెబ్రిటీస్ కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యారు. […]

Update: 2020-12-02 03:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మన మధ్య లేకపోయినా.. టాప్ ప్లేస్‌లో మాత్రం తనే ఉన్నాడు. 2020 ఎండింగ్‌కు చేరుకోవడంతో యాహూ రిలీజ్ చేసిన ‘మోస్ట్ సెర్చ్‌డ్ పర్సనాలిటీస్ 2020’ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. అంతేకాదు తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్‌తో పాటు బీటౌన్ సెలెబ్రిటీస్ కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యారు.

అత్యధిక మంది సర్చ్ చేసిన మేల్, ఫిమేల్ లిస్ట్‌లను ‘యాహూ’ సెపరేట్‌గా కూడా షేర్ చేసింది. మేల్ సెలెబ్రిటీస్ లిస్ట్‌లో సుశాంత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. అమితాబ్ బచ్చన్ సెకండ్ ప్లేస్, అక్షయ్ కుమార్ థర్డ్ ప్లేస్‌, సల్మాన్ ఖాన్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక లాక్‌డౌన్‌‌లో క్యాన్సర్‌తో కన్నుమూసిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఐదో స్థానంలో నిలవగా.. దివంగత రిషి కపూర్ ఆరో స్థానంలో ఉన్నారు. తన గాత్రంతో మానవాళిని సమ్మోహనం చేసిన గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏడో స్థానంలో ఉండగా.. లాక్‌డౌన్ రియల్ హీరో సోనూ సూద్ ఎనిమిది, అనురాగ్ కశ్యప్ తొమ్మిది స్థానాల్లో కొనసాగారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ పర్సనాలిటీస్‌లో టెన్త్ ప్లేస్‌లో నిలవగా.. ఫ్యాన్స్ విషెస్‌తో సోషల్ మీడియా నిండిపోయింది. ఇక ఫిమేల్ లిస్ట్‌లో రియా చక్రవర్తి టాప్‌లో ఉండగా.. కంగనా రనౌత్, దీపికా పదుకొనే వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సన్నీలియోన్, ప్రియాంక చోప్రా నాలుగు, ఐదు స్థానాల్లో నిలవగా… తర్వాతి ర్యాంక్‌లో కత్రినా కైఫ్, నేహా కక్కర్, కనికా కపూర్, కరీనా కపూర్ ఖాన్, సారా అలీ ఖాన్ ఉన్నారు.

యాహూ రిలీజ్ చేసిన లిస్ట్‌లో పొలిటిషియన్స్ ఒక్కరు కూడా టాప్‌టెన్‌లో లేకపోగా.. టాప్ 3లో సుశాంత్, రియా చక్రవర్తి ఉండటం గమనార్హం. జూన్ 14న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా దేశం మొత్తం షాక్ అయింది. తనకు న్యాయం చేయాలంటూ ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతుండగా.. సీబీఐ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.

Tags:    

Similar News