విధుల్లో నిర్లక్ష్యం.. మున్సిపల్ కమిషనర్‌‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

దిశ, భువనగిరి రూరల్: ఆలేరు మున్సిపల్ కమిషనర్ లావణ్య లతను విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా.. మార్పు రాలేదు. దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తీవారి సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం, చేయ్యాల్సిన […]

Update: 2021-07-30 08:04 GMT

దిశ, భువనగిరి రూరల్: ఆలేరు మున్సిపల్ కమిషనర్ లావణ్య లతను విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా.. మార్పు రాలేదు. దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తీవారి సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం, చేయ్యాల్సిన కనీస పనులపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. మరెవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News