Sandhya Theatre: ఇదే మా విధానం.. అల్లు అర్జున్ కేసుపై మంత్రి కొండా సురేఖ పరోక్ష కామెంట్స్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా, సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటన హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా, సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉదంతంపై రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో పలువురు పలు రకాలు స్పందిస్తున్నారు. కొంతమంది నెగిటివ్‌గా.. మరికొంతమంది పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే, తెలంగాణ అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekh) పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టు ఇటు సోషల్ మీడియాలో.. అటు రాజకీయ వర్గాల్లో హల్ చల్ అవుతున్నది.
‘‘యుద్ధం ఏదయినా... పోరాటం మరేదైనా మనం ఎపుడూ బాధితుల పక్షమే ఉండాలి... వారి బతుకులు మార్చేందుకు... వారికి భద్రమైన భవితను అందించేందుకు కృషి చేయాలి... బడాబాబుల కోసం బక్క ప్రాణాలకు ఎపుడూ నష్టం చేయకూడదు.. చేయం కూడా... ఇది మా నినాదం మాత్రమే కాదు... మా విధానం కూడా!’’ అంటూ తన వాల్ మీద రాసుకున్న అంశం పరోక్ష పద్ధతిలో తాను బాధితుడి పక్షానే నిలుస్తానని చెప్పడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దీంతో మంత్రి అల్లు అర్జున్ కేసు ఇష్యూ మీదే ట్వీట్ పెట్టిందని కొందరు.. కాదని మరికొందరు నెట్టింట చర్చ చేస్తున్నారు.
యుద్ధం ఏదయినా... పోరాటం మరేదైనా మనం ఎపుడూ బాధితుల పక్షమే ఉండాలి..
— Konda Surekha (@iamkondasurekha) December 22, 2024
వారి బతుకులు మార్చేందుకు... వారికి భద్రమైన భవితను అందిoచేoదుకు కృషి చేయాలి.
బడాబాబుల కోసం బక్క ప్రాణాలకు ఎపుడూ నష్టం చేయకూడదు.. చేయం కూడా..
ఇది మా నినాదం మాత్రమే కాదు... మా విధానం కూడా..@revanth_anumula… pic.twitter.com/Fap87PlBrX