నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఉద్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు...
దిశ, వెబ్ డెస్క్: కేంద్రప్రభుత్వ శాఖలు హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, కటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైనా అభ్యర్థులకు ఈ రోజు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ‘రోజ్ గారి మేళా’(Rose Gari Mela)లో భాగంగా దేశవ్యాప్తంగా 71 వేల మంది యువకులకు ప్రధాని మోడీ(Prime Minister Modi) నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో ఈ ‘రోజ్ గారి మేళా’ నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోడీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.
అనంతరం ఆయా కేంద్రాల్లో కేంద్రమంత్రులు ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. హైదరాబాద్(Hyderabad)లో నిర్వహించిన ‘రోజ్ గారి మేళా’ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకమైన ఉద్యోగులకు నియమాక పత్రాలను ఆయన అందజేసి ప్రసంగించారు. రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. రోజ్‌గార్ మేళాలో ప్రతిభ కలిగినవారికే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తన శాఖలో మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.