Congress: అల్లు అర్జున్ మామను కలిసేందుకు ఇష్టపడని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ(Allu Arjun's Uncle), కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Congress leader Kancharla Chandrasekhar Reddy) గాంధీభవన్(Gandhi Bhavan) కు వచ్చారు.

Update: 2024-12-23 10:17 GMT

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు అల్లు అర్జున్ మామ(Allu Arjun's Uncle), కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Congress leader Kancharla Chandrasekhar Reddy) గాంధీభవన్(Gandhi Bhavan) కు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు రావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్(Telangana Congress In-Charge) దీపాదాస్ మున్షీని(Deepadas Munshi) కలిసేందుకు ఆయన గాంధీ భవన్ కు వచ్చారు.

మున్షీతో భేటీ అయ్యేందుకు చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ లోని ఆమె ఆఫీస్ కు వెళ్లారు. దీపాదాస్ మున్షీకి ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్ ఉండటంతో చంద్రశేఖర్ రెడ్డికి సమయం ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. అయితే కాంగ్రెస్ నేత(Congress leader)గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కలవకపోవడం కొత్త చర్చలకు దారి తీసింది. అల్లు అర్జున్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతున్న క్రమంలో ఈ భేటీతో కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని గ్రహించి కావాలనే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ, చంద్రశేఖర్ రెడ్డికి సమయం ఇవ్వలేదా? లేక నిజంగా ఆయన ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చారా? అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News