Theenmar Mallanna: హీరో‌ పై చర్యలు తీసుకోండి.. పుష్ప 2 సినిమాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు

పుష్ప 2 సినిమా(Puspa-2 Movie)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Theenmar Mallanna) మేడిపల్లి పోలీస్ స్టేషన్‌(Medipalli Police Station)లో ఫిర్యాదు చేశారు.

Update: 2024-12-23 13:39 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో: పుష్ప 2 సినిమా(Puspa-2 Movie)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Theenmar Mallanna) మేడిపల్లి పోలీస్ స్టేషన్‌(Medipalli Police Station)లో ఫిర్యాదు చేశారు. సినిమాలో కొన్ని సీన్లు(Scenes) పోలీసులను కించపరిచేలా(Insulting The Police) ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. ఇటీవలే థియేటర్‌కు వెళ్లి పుష్ప-2 సినిమా చూశానని, సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. పోలీసుల పట్ల చిన్నచూపు చూసే విధంగా గంధపు చెక్కల స్మగ్లర్(Smuggler) పెద్ద హీరోగా.. స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కారును ఢీ కొట్టి పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్‌లోనే హీరో మూత్రం పోయడం పోలీసులను చాలా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై డైరెక్టర్ సుకుమార్(Director Sukumar), ప్రొడ్యూసర్(Producer), సినిమా హీరో అల్లు అర్జున్(Allu Arjun) పైన చర్యలు(Action) తీసుకోవాలని, చట్టరీత్యా ఆ సీన్లను కట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు స్మగ్లర్లనే హీరోలాగా చూపిస్తే.. నేటి యువత అదే మార్గంలో చెడు మార్గంలో వెళ్తే ఇది సమాజాన్ని నాశనం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించి పదిమందికి ఉపయోగపడే సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఇక ఇటువంటి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు యాక్టింగ్ చేసిన హీరోల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నానని తీన్మార్ మల్లన్న తెలియజేశారు.


Read More..

T Congress : అల్లు అర్జున్ అలా చేసి ఉండాల్సింది : చామల కిరణ్ కుమార్ రెడ్డి 

Tags:    

Similar News