Shyam Benegal : శ్యామ్ బెనెగల్ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
ప్రముఖ భారతీయ దర్శకుడు శ్యాం బెనెగల్(Shyam Benegal) మృతిపై నటుడు చిరంజీవి(Chieanjivi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ భారతీయ దర్శకుడు శ్యాం బెనెగల్(Shyam Benegal) మృతిపై నటుడు చిరంజీవి(Chieanjivi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో బెనగల్ ఒకరంటూ కొనియాడారు. చలనచిత్ర రంగంలో వెలుగొందిన కొంతమంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మహానుభావుడు ఆయన అన్నారు. ఆయన తీసిన సినిమాలు, జీవిత చరిత్రలు, నిర్మించిన డాక్యుమెంటరీలు భారతీయ సాంస్కృతిక సంపదలో అవి ముఖ్యమైన భాగం అని వెల్లడించారు. తోటి హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన బెనెగల్ అద్భుతమైన సినిమాలు.. భారతీయ సినీ రంగంలో కలకాలం గౌరవాన్ని పొందుతాయని చిరంజీవి తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.