రాష్ట్రానికే తలమానికం సింగరేణి

సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం ఓసీ నందు సోమవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు.

Update: 2024-12-23 16:45 GMT

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం ఓసీ నందు సోమవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ నరసింహారావు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను దశాబ్ద కాలంగా తీర్చటంలో సింగరేణి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్రానికి సింగరేణి తలమానికంగా నిలుస్తుందని అన్నారు. సింగరేణి ఉద్యోగులందరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఈ రమణారావు, మేనేజర్ రామకృష్ణ, రక్షణ అధికారి గోపి కిషోర్, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు కిషోర్, ఐఎన్టీయూసీ నాయకులు బాలాజీ, సంక్షేమ అధికారి విజయ సందీప్, సింగరేణి, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News