పాయం పర్యటనను విజయవంతం చేయండి.. సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
మండల కేంద్రంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం పర్యటించనున్నారని మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు.
దిశ, కరకగూడెం : మండల కేంద్రంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం పర్యటించనున్నారని మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని తాటి గూడెం గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవం, సమీక్షా సమావేశం అలాగే ప్రభుత్వ ఆసుపత్రి 102 అంబులెన్సు వాహనం ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు హాజరై ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయగలరని కోరారు.