యువకుడిని హతమార్చిన మావోయిస్టులు..

ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోమారు హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఆదివాసీ యువకుడిని హతమార్చారు.

Update: 2024-12-23 06:07 GMT

దిశ, చర్ల : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోమారు హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఆదివాసీ యువకుడిని హతమార్చారు. వివరాల్లోకెళితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్కానార్ గ్రామానికి చెందిన ముఖేష్ హేమ్లాను శనివారం మధ్యాహ్నం మావోయిస్టులు అపహరించారు.

పనిమీద మార్కెట్ కు వచ్చిన యువకుడిని కత్తులతో బెదిరించిన మావోయిస్టులు వారితో తీసుకెళ్లారు. అనంతరం సోమవారం ఆ యువకుడి పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చినట్లు మావోయిస్టు పార్టీ గంగులూరు ఏరియా కమిటీ ప్రకటించింది. మృతదేహం పక్కన మావోయిస్టు పార్టీ గంగులూరు ఏరియా కమిటీ లేఖను ఉంచింది.


Similar News