Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతం
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యయారు. పిలిభీత్ లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం రాత్రి నుంచి ఎదురుకాల్పులు జరగగా.. అందులో ముగ్గురు చనిపోయారు. మృతులను గుర్విందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్‌ప్రీత్ సింగ్ గా గుర్తించారు. వారి నుంచి 2 రెండు రైఫిళ్లు, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. గడిచిన వారంలోనే పంజాబ్‌లోని మూడు పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. అందులో భాగంగానే ముగ్గురు చనిపోయారు.
ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్
ముగ్గురూ పాకిస్థాన్ ప్రాయోజిత ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్‌లో భాగమని పంజాబ్ పోలీసులు తెలిపారు. "ఈ టెర్రర్ మాడ్యూల్ పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు స్థావరాలపై గ్రెనేడ్ దాడులకు పాల్పడింది. పిలిభీత్, పంజాబ్ పోలీసు బృందాలు పురానాపూల్ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. గురుదాస్ పూర్ లోని చెక్ పోస్టుపై గ్రనైడ్ దాడితో ఈ ముగ్గురికి సంబంధం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది" అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసుల మధ్య సమన్వయానికి ఈ ఎన్ కౌంటర్ మంచి ఉదాహరణ అని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.