రోడ్డు ప్రమాదంలో మహిళా టెకీ మృతి..

అతివేగంతో వస్తున్న కారు ముందున్న బైకును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-12-23 05:43 GMT

దిశ, శేరిలింగంపల్లి : అతివేగంతో వెళుతున్న కారు ముందున్న బైకును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మేరకు.. కామారెడ్డికి చెందిన శ్రీవాణి (21) గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ర్యాపిడో బైక్ పై వెళుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా దూసుకు వచ్చిన స్కోడా కారు ముందుగా వెళుతున్న బైక్ ను బలంగా ఢీ కొట్టింది.

దీంతో బైక్ వెనకాల కూర్చున్న శ్రీవాణి అక్కడికక్కడే మృతి చెందగా ర్యాపిడో డ్రైవర్ వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీవాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, గాయపడ్డ వెంకట్ రెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారును డ్రైవ్ చేసిన వ్యక్తి నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ప్రముఖ పల్మనాలజిస్ట్ కుమారుడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News