30 ఏళ్లు దాటిన మగాళ్లు ఈ డ్రింక్ తాగండి.. ఊహించని లాభాలు మీ సొంతం!

ముప్పై ఏళ్ల తర్వాత మగాళ్లు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం.

Update: 2024-12-23 17:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముప్పై ఏళ్ల తర్వాత మగాళ్లు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మగవాళ్ల, ఆడవాళ్ల జీవితం 30 సంవత్సరాల తర్వాతే ప్రారంభమవుతుంది. అప్పుడే హెల్త్ కండీషన్లు(Health conditions) దాదాపు వీక్ అయిపోతుంటాయి. కాగా బలంగా ఉండేందుకు పలు ఆహారాలు, డ్రింక్స్ తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ముప్పై ఏళ్ల తర్వాత మగాళ్లు ఈ డ్రింక్ తీసుకుంటే ఊహించని లాభాలు మీ సొంతమవుతాయి. అదే ఓక్రా వాటర్(Okra water). దీనిని మీరు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రజెంట్ డేస్‌లో ముప్పై ఏళ్లు దాటిన వారిలో డయాబెటిక్(Diabetic) సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. కాగా దీనికి బెస్ట్ మెడిసిన్ ఓక్రా వాటర్ అంటున్నారు నిపుణులు. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే షుగర్‌(Sugar)ను క్రమబద్ధీకరిస్తుంది. టైప్-2 డయాబెటిస్‌(Type-2 Diabetes)తో బాధపడేవారికి ఈ వాటర్ తాగితే లబ్ధి పొందారని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ పెషేంట్లు ఆహారం తక్కువగా తీసుకునే పని లేకుండా ప్రతి రోజూ ఓక్రా వాటర్ తాగితే సరిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే రోగినిరోధక శక్తి మెరుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

30 ఏళ్ల తర్వాత ప్రతి రోజు ఓక్రా వాటర్ తాగితే.. శరీరం సహజంగా ఇన్ఫెక్షన్ల(infections)తో పోరాడటానికి శక్తివంతంగా ఉండటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జలుబు(cold), ఫ్లూ(Flu) వంటి సాధారణ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్‌(Bad cholesterol)ను తగ్గిస్తుంది. అలాగే ఓక్రాలోని యాంటీ ఆక్సిడెంట్స్(Antioxidants) సిరల్లో అడ్డంకులు అడ్డుకుంటాయి. ఇది గుండెపోటు(heart attack) లేదా స్ట్రోక్(stroke) నుంచి కాపాడుతుంది.

ఎముకల ఆరోగ్యా(Bone health)నికి ఓక్రా వాటర్ ఎంతో మేలు చేస్తుంది. బోన్స్‌ను స్ట్రాంగ్‌(Strong bones)గా ఉంచడంతో పాటుగా పలు ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. క్రమంగా ఓక్రా డ్రింక్ తాగితే ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. మరీ ఈ ఓక్రా డ్రింక్ తయారీ విధానం చూసినట్లైతే..

ముందుగా బెండకాయల్ని(Okra) క్లీన్‌గా కడుక్కుని.. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ వాటర్‌ను, బెండ ముక్కల్ని వేరు చేయాలి. ఇక బెండకాయల్ని నానబెట్టిన వాటర్ ను తాగండి. అంతే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ వాటర్‌ను తినడానికి ముందు తీసుకుంటే కనుక లాభాలు ఎక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News