Shikha Goyal: ఈ ఏడాది సైబర్‌ క్రైం 18శాతం హైక్

ఈ ఏడాది సైబర్‌ క్రైం 18శాతం పెరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్‌ వెల్లడించారు.

Update: 2024-12-23 13:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం సైబర్ నేరాలు పెరిగాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్‌ (Shikha Goyal) వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె సైబర్ క్రైమ్‌పై వార్షిక రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది లక్షా14వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సైబర్ క్రైమ్‌తో కేటుగాళ్లు రాష్ట్రంలో రూ.1,866 కోట్లు స్వాహా చేశారని చెప్పారు. రూ.176 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 24,643 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. సైబర్ నేరాల్లో దోచిన సొమ్మును క్రిప్టోగా మార్చి దుబాయ్‌కి తరలిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరగాళ్లకు నగదు డ్రా చేసి పంపిస్తున్న 21 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News