భూకంపం వచ్చినా మేడిగడ్డకు ఏం కాలేదు: వినోద్‌కుమార్‌

బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinod Kumar) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై విమర్శలు చేశారు.

Update: 2024-12-23 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinod Kumar) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ హమీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను అమలు చేయడం లేదని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు విఫలంపై.. బీఆర్ఎస్ తరుఫున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మేడిగడ్డ(Madigadda) పై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కూలిపోయే మేడిగడ్డ ప్రాజెక్టును కట్టిందని అన్నర్నారు. భూకంపం వచ్చినా మేడిగడ్డకు ఏం కాలేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project) అంటే మేడిగడ్డ ఒకటే కాదని, మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు వెంటనే మరమ్మతులు చేయాలి ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయిన్‌పళ్లి వినోద్‌కుమార్‌ డిమాండ్ చేశారు.


Similar News