హత్యాయత్నం ఘటనపై స్పందించిన ట్రంప్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తు తెలియని
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపగా.. బుల్లెట్ ట్రంప్ కుడి చేవికి తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్‌కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, హత్యాయత్నం ఘటన తర్వాత తొలిసారి ట్రంప్ స్పందించారు.
దుండగుల కాల్పుల్లో నా కుడిచెవి పై భాగంలో బుల్లెట్ తగిలిందని వెల్లడించారు. ఊహించని ఘటన జరిగిందని వెంటనే అర్థమైందని.. తనపైకి ఏదో దూసుకువచ్చినట్లు శబ్ధం వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత తన చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని అర్థమైందన్నారు. చాలా రక్తం కారిందని, ఆ తర్వాత ఏం జరిగిందో గ్రహించానని అన్నారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్, డెమోక్రటిక్ నుండి జో బైడెన్ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎలక్షన్ రేసులో ఉన్న ట్రంప్‌పై కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.