నువ్వు మనిషివేనా..? విమానంలో కుక్కను ఎక్కనివ్వలేదని.. కుక్కనే చంపిన మహిళ!

ఓర్లాండో (Orlando airport) ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2025-03-23 06:36 GMT
నువ్వు మనిషివేనా..? విమానంలో కుక్కను ఎక్కనివ్వలేదని.. కుక్కనే చంపిన మహిళ!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఓర్లాండో (Orlando airport) ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జంతు రవాణాకు తగిన పత్రాలు లేవని కుక్కను విమానంలో సిబ్బంది ఎక్కనివ్వలేదు. దీంతో కుక్కను ఫ్లోరిడా విమానాశ్రయ బాత్రూంలో చంపి చెత్తలో పడేసి మహిళా యజమాని వెళ్ళిపోయింది. ఓర్లాండో పోలీసుల వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ 16న కొలంబియాకు వెళ్లడానికి తెల్లటి స్క్నాజర్ టైవిన్‌ కుక్క(9)తో కలిసి ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి అలిసన్ లారెన్స్ అనే మహిళ (57) వెళ్లారు. విమానాశ్రయంలో స్క్నాజర్ టైవిన్‌ కుక్కకు విమానంలో ఎక్కడానికి జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని సిబ్బంది అడ్డుకున్నారు. ఎయిర్‌లైన్ ఏజెంట్‌తో మాట్లాడిన తర్వాత, కుక్కను బాత్రూంలోకి తీసుకెళ్లారు. కుక్కని నీళ్లలో ముంచి చంపి, చెత్త సంచిలో కుక్కి మరుగుదొడ్డిలో పారేసి వెళ్లిపోయారు.

కుక్క మృతదేహాన్ని ఓ సెక్యూరిటీ గుర్తించాడు. దీంతో సీసీ ఫుటేజీ ఆధారంగా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా కుక్క మెడకున్న పట్టీపై యజమానురాలి పేరు అలిసన్ లారెన్స్ (57) ఫోన్ నెంబర్ ఉండడంతో ఆమెను లూసియానాలోని కెన్నర్‌కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే జంతు హింస నేరం కింద ఓర్లాండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తర్వాత 5 వేల డాలర్ల పూచీకత్తుతో ఆమెను బెయిల్‌పై తాజాగా విడుదల చేశారు. కుక్కను చంపిన ఘటనపై నెటిజన్లు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. చిన్న కుక్కపిల్లను విమానం ఎక్కనివ్వకపోతే.. చంపేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అంటూ మండిపడుతున్నారు. కాగా, యూఎస్ చట్టం ప్రకారం.. విమానంలో ప్రయాణించే కుక్కలు తప్పనిసరిగా పశువైద్యుడి నుంచి ఆరోగ్య ధృవీకరణ పత్రం, రేబిస్ టీకా రుజువు రెండింటినీ కలిగి ఉండాలి.

Tags:    

Similar News