US: ఒక్కరోజే 1000 ఇమిగ్రేషన్ గోల్డ్ కార్డ్‌లు.. 5 బిలియన్ డాలర్ల సేకరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇటీవలే ‘గోల్డ్‌ కార్డు’ను ప్రవేశపెట్టారు. అయితే, ఒక్కరోజులోనే వెయ్యి కార్డులను విక్రయించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ తెలిపారు.

Update: 2025-03-22 13:20 GMT
US: ఒక్కరోజే 1000 ఇమిగ్రేషన్ గోల్డ్ కార్డ్‌లు.. 5 బిలియన్ డాలర్ల సేకరణ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇటీవలే ‘గోల్డ్‌ కార్డు’ను ప్రవేశపెట్టారు. అయితే, ఒక్కరోజులోనే వెయ్యి కార్డులను విక్రయించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. వీటి ద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించామన్నారు. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. కనీసం పది లక్షల మంది ఈ కార్డుని కొనేందుకు రెడీగా ఉన్నారని.. వీటి ద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే ఛాన్స్ ఉందన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా 3.7కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉంది. కనీసం 10లక్షల మంది దీనిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నారు’’ అని లుట్నిక్‌ పేర్కొన్నారు. అసలు ఈ కార్డుని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ట్రంప్ దే అని చెప్పుకొచ్చారు. ట్రంప్ ఆలోచనను అమలు చేయడమే తమ బాధ్యత అని అన్నారు. ఇదే విషయంపై ఇటీవల లుట్నిక్‌ మాట్లాడారు. 2.5లక్షల మంది ఈ గోల్డ్‌ కార్డు కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నాం. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

5 లక్షల మందికి షాక్..

మరోవైపు, అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అక్రమవలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం యూఎస్ వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మందికి పైగా వలసదారులకు షాక్ ఇచ్చారు. వారికి తాత్కాలిక నివాస హోదాను (Temporary Status for Immigrants) రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. 2022 అక్టోబరు తర్వాత బైడెన్ స్కీం ద్వారా ఆ నాలుగు దేశాల నుంచి అమెరికాకు భారీగా వలసలు వచ్చాయి. అలా వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అయితే, మానవతా పెరోల్ ప్రోగ్రాం కింద అమెరికాకు వలస వచ్చిన వారిపైన ప్రభావం పడనుంది. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాకు వచ్చారని, రెండేళ్ల పాటు యూఎస్‌లో నివసించడానికి, పని చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందారని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌ వెల్లడించారు. వీరు ఏప్రిల్‌ 24న లేదా ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అగ్రరాజ్యంలో ఉండేందుకు లభించిన లీగల్‌ స్టేటస్‌ను కోల్పోనున్నారని తెలిపారు. ఈ చర్య వల్ల ప్రభావితమైన వారు వెంటనే ఇమిగ్రేషన్ న్యాయవాది నుండి సలహా తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News