మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

Update: 2025-03-25 05:54 GMT
మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
  • whatsapp icon

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ (A huge encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి (Four Maoists killed) చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రస్తుతం భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఎన్ కౌంటర్‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సంఘటన స్థలం నుంచి మావోయిస్టుల మృత దేహాలను, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ని బస్తర్ పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.

Similar News