Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మట్టుబెట్టండి.. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి

దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ రగిలిపోతోంది.

Update: 2024-10-02 13:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ప్రతిదాడికి అవసరమైన సైనిక ప్రణాళికను రెడీ చేస్తోంది. ఈక్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై దేశ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నాయి. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ అత్యున్నత పాలనా కేంద్రాలు లక్ష్యంగానూ ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెలీ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇజ్రాయెల్‌పై దాడికి ప్రధాన కారకుడైన ఇరాన్ సుప్రీం లీడర్‌‌ను తాము వదలబోమని పేర్కొన్నారు. ఇరాన్ లాంటి దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఇరాన్‌లోని అణ్వాయుధ పరిశోధనా కేంద్రాలపైనా తమ సైన్యం దాడులు జరగొచ్చన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భారీ భద్రత నడుమ రహస్య ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. 


Similar News