Putin-Kim: ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు సర్‌ఫ్రైజ్..మరోసారి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పుతిన్..ఈ సారి ఏమిచ్చారంటే..?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య ఇటీవలి కాలంలో స్నేహం మరింత బలపడింది.

Update: 2024-09-02 00:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య ఇటీవలి కాలంలో స్నేహం మరింత బలపడింది. అది ఎంతలా అంటే వ్యక్తిగత బహుమతులు ఇచ్చి పుచ్చుకునేంతలా. తాజాగా మరోసారి కిమ్ కు మేలిమి జాతికి చెందిన 24 గుర్రాలను పుతిన్ బహుమతిగా ఇచ్చారు. అయితే ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాల పరంగా సహకరిస్తున్న విషయం తెలిసిందే. అందుకు కృతజ్ఞతగా పుతిన్‌ ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఈ గుర్రాలను గిఫ్ట్ గా పంపినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రకటించాయి. రష్యా పంపిన గుర్రాల్లో కిమ్‌కు అత్యంత ఇష్టమైన ఓర్లోవ్‌ ట్రోటర్‌ జాతికి చెందిన 19 స్టాలియన్లు, ఐదు మరే జాతి గుర్రాలు ఉన్నట్లు టైమ్స్ పత్రిక పేర్కొంది.


కాగా ఈ ఏడాది జూన్‌లో పుతిన్ ఉత్తర కొరియాలో 24 ఏళ్ల తర్వాత తొలిసారి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా పుతిన్ కు పంగ్సన్‌ అనే తెల్లటి వేటాడే శునకాలను కిమ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకు పుతిన్ కూడా ఆరుస్‌ లిమోసిన్‌ కారును కిమ్ కు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కిమ్‌కు, పుతిన్ 447 మేకలను ఇచ్చారు. తాజాగా మేలి జాతికి చెందిన గుర్రాలను నియంత కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు.


Similar News