Kamala Harris: నా ఇంట్లోకి చొరబడితే కాల్చి పడేస్తా.. కమలా హారిస్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ లు బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల వేళ వైస్ ప్రెసిడెంట్(Vice President) కమలా హారిస్.. అమెరికా మిచ్ లోని ఫార్మింగ్ టన్ హాల్ లో యునైట్ ఫర్ అమెరికా(Unite for America) లైవ్ స్ట్రీమింగ్ లో ప్రముఖ అమెరికన్ టెలివిజన్ ప్రొడ్యూసర్, వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రే(Oprah Winfrey) తో కలిసి ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. కమలా హారిస్ అమెరికా దేశంలోని తుపాకీ సంస్కృతి(Gun Culture) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.."ఎవరైనా తన ఇంట్లోకి చొరబడితే వారిని కాల్చి పడేస్తా, నేను ఇలా చెప్పకూడదు. అయితే ఈ పని నా సిబ్బంది చూసుకుంటారు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలో తుపాకీల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని.. అది పోవాలని నేను చాలా కాలం నుంచి అనుకుంటున్నాను అని అన్నారు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. అమెరికాలో ఆయుధాల నిషేధం, సార్వత్రిక ఆయుధ తనిఖీల వంటి వాటికి నేను పూర్తి అనుకూలం" అని యునైట్ ఫర్ అమెరికా ఈవెంట్ లో కమలా హారిస్ వెల్లడించారు. అయితే వ్యక్తిగత భద్రత కోసమే తాను తుపాకీని కలిగి ఉన్నానని, తనకు షూటింగ్ సైతం వచ్చని ఈ సందర్భంగా కమలా తెలిపారు.