Virus Predictions: 2025లో మరో మహమ్మారి వస్తుందని ముందే జోస్యం చెప్పిన భారత జ్యోతిష్కుడు.. వణుకు పుట్టిస్తున్న పోస్ట్

ఒక కొత్త మహమ్మారి 2025 ఏప్రిల్‌లో రాబోతుంది.

Update: 2025-01-08 04:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో కరోనా వైరస్ మిగిల్చిన చేదు అనుభవాలను ఇంకా మరువక ముందే 2025 మొదటి నుంచి హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ (HMPV) వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. 2020 లో కరోనాను మొదట్లో నిర్లక్ష్యం చేసినందుకు ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే, 2025లో ప్రపంచానికి పెను ముప్పు రానుందని బాబా వంగా, నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యాలు గుర్తుకు రావడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. నోస్ట్రాడమస్ , బాబా వంగా 2025లో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుందని, ఊహించని విపత్తులు సంభవిస్తాయని చెప్పినట్లు కథనాలు ఉన్నాయి. అయితే, వీరిద్దరి జోస్యాలలో కొన్ని నిజం కావడంతో అందరూ వణికిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక పాత పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో అనిరుధ్ కుమార్ మిశ్రా అనే భారత కాల జ్ఞాని 2025లో మరో మహమ్మారి వస్తుందని ముందే జోస్యం చెప్పారు. అంతే కాదు, 2022 ఆగస్టు 9నే తన ట్విటర్ ( X) లో దీని గురించి ఒక పోస్ట్ పెట్టారు. “ఒక కొత్త మహమ్మారి 2025 ఏప్రిల్‌లో రాబోతుంది. ఇది ప్రపంచంలోని చాలా మందిని శాకాహారులుగా మారుస్తుంది. దీని విధ్వంసం 4 ఏళ్ల 5 నెలల పాటు ఉంటుంది, తర్వాత అది కంట్రోల్లోకి వస్తుంది.” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.

అయితే, వీటిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఒక్కొక్కరు ఒక్కోలా దీని గురించి వివరిస్తుంటారు. కాబట్టి, భయపడకుండా నిజం తెలుసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచించే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి వైరస్ అయిన సులభంగా అడ్డుకోవచ్చు.

Tags:    

Similar News