ఈ పండ్ల తొక్కల్ని తినకుండా పారేస్తున్నారా.. సంపూర్ణ పోషకాలు మిస్ అవుతున్నట్లే?
చాలా మంది ఫ్రూట్స్‌పై తొక్కల్నికట్ చేసుకుని తింటారన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఫ్రూట్స్‌పై తొక్కల్నికట్ చేసుకుని తింటారన్న విషయం తెలిసిందే. అయితే తొక్కే కదా అని విసిరిపారేస్తే మీరు నష్టపోతారంటున్నారు నిపుణులు. అనేక రకాల కూరగాయల్ని, ఫ్రూట్స్ ను పీలర్ తో చకా చకా తీసి డస్ట్ బిన్‌లో వేస్తుంటారు. ఇది చాలా మందికి అలవాటు. కానీ పండ్ల తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో ఎవరికీ తెలియదు.
సేపు(apple) తినేటప్పుడు దానిపైన మైనం ఉంటుందని పైన కట్ చేసి తింటుంటారు. జామకాయ(Guava) వగరుగా ఉంటుందని.. కేవలం చాలా మంది లోపల గుజ్జు మాత్రమే తింటుంటారు. కమలపండు కచ్చాపచ్చాగా నములుతారు. నమిలి ఉమ్మేస్తారు. అయితే ఈ అలవాటు సంపూర్ణ పోషకాలను మన బాడీకి అందకుండా చేస్తున్నాయని చెబుతున్నారు.
పండ్లతో పాటు తొక్కల్ని కూడా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు హెల్తీ స్కిన్ కూడా.. మెరిసిపోయే చర్మం మీ సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ తొక్కలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాగా ఇవి ఫేస్ కు పొడి చేసుకుని అప్లై చేస్తే మచ్చలు(Spots), పిగ్మెంటేషన్(Pigmentation) ను తగ్గించడంలో మేలు చేస్తుంది. నారింజ తొక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. రంధ్రాలను శుభ్రపరచంలో తోడ్పడుతుంది. ఇక బనానా తొక్క మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
బొప్పాయి(papaya) తొక్కలోని ఎంజైమ్‌లు(Enzymes) మృతకణాల స్కిన్‌ను ఎక్స్ ఫోలియేట్(Ex foliate) చేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు. విటమిన్ ఎ, సి దట్టంగా ఉండే యాపిల్ చర్మ స్థితిస్థాపకతను నిర్వహించడానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్యం తొందరగా రాకుండా చూస్తుంది. మామిడి తొక్క చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. కాగా తొక్కల్ని పారేయకుండా కొన్ని డైరెక్ట్ గా తినాలని.. కొన్ని ఫేస్ ప్యాక్ కోసం వాడాలని నిపుణులు చెబుతున్నారు.