Chinta Mohan : భక్తులే సొమ్మసిల్లి పడిపోయారు. : మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వివాదస్పద వ్యాఖ్యలు

తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)పై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్(Former Union Minister Chinta Mohan) వివాదస్పద వ్యాఖ్యలు(controversial remarks) చేశారు

Update: 2025-01-09 07:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)పై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్(Former Union Minister Chinta Mohan) వివాదస్పద వ్యాఖ్యలు(controversial remarks) చేశారు. భక్తులను ఎవరు తోయలేదని, సుదూరం నుంచి ఏమి తినకుండా కిక్కిరిసిన క్యూలైన్లలో వేచి ఉండి..బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయి వారంతట వారే సొమ్మసిల్లి పడిపోయారన్నారు.

తొక్కిసలాటలో టీటీడీ వైఫల్యం ఏమి లేదన్నారు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదని, గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడటంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం, టీటీడీకి, ఆధికారులకు సంబంధం లేదన్నారు. గతంలో కంటే ఇప్పుడు టీటీడీ మెరుగ్గా పనిచేస్తుందన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారు. ప్రభుత్వం మృతులకు ఒక్కొక్కరికి రూ.25లక్షల పరిహారం సైతం ప్రకటించింది.

ఒక్కసారిగా గేట్లు తెరవడం..పోలీసులు భక్తులపై లాఠీచార్జితో తొక్కిసలాట జరిగిందని.. ఘటనలో గాయపడిన వారికి సకాలంలో అంబులెన్స్ వసతులు సైతం లేకపోయిందన్న అంశాలపై విమర్శలు రేగుతున్నాయి. ఈ ఘటనలో టీటీడీ, పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే అందుకు విరుద్ధంగా టీటీడీని వెనకేసుకొస్తూ చింతామోహన్ మాట్లాడం ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News