Breaking News : టీటీడీ జేఈవో బదిలీ
తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) దర్శన టోకెన్ల జారీలో బుధవారం రాత్రి తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మృతి చెందగా.. పలువురు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) దర్శన టోకెన్ల జారీలో బుధవారం రాత్రి తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు మృతి చెందగా.. పలువురు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక అధికారులను సస్పెండ్ చేయగా.. తాజాగా మరో అధికారిపై చర్యలు తీసుకుంది. టీటీడీ ఆలయ జేఈవో(TTD JEO)ను బదిలీ చేసింది. తొక్కిసలాటకు జేఈవో గౌతమి నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే సాధారణ పరిపాలనాశాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.