YS Jagan: తిరుపతిలో ఘటన రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
తిరుపతి(Tirupati)లో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) పరిశీలించారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati)లో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు గొప్పగా నిర్వహించామని తెలిపారు. ఒకచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు.. విష్ణునివాసంలో ఒకరు చనిపోయారని FIR కాపీలో ఉంది.. బైరాగిపట్టెడలో ఐదుగురు చనిపోయారని FIRలో ఉంది.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారని జగన్ తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. మొత్తం 50 నుంచి 60 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.. ఇంత దారుణంగా వ్యవస్థను నడుపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఎవరూ పట్టించుకోలేదని జగన్ ఫైర్ అయ్యారు.
తిరుపతిలో ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని అన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదు.. టీటీడీ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్ అందరూ ఇందులో భాగస్వాములే అని జగన్ అన్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కల్యాణ్ సహా మంత్రులు సైతం స్పందించి.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.