Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో మరో భీకర ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులు (Maoists), భద్రతా బలగాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ (Huge Encounter) చోటుచేసుకున్న భయానక ఘటన ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టులు (Maoists), భద్రతా బలగాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ (Huge Encounter) చోటుచేసుకున్న భయానక ఘటన ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ (Telangana) రాష్ట్ర సరిహద్దు వెంట ఉన్న దక్షిణ బీజాపూర్ (South Bijapur) జిల్లాలోని ఉసూర్ (Ushur), బాసగూడ (Basaguda), పమేడ్ (Pamed) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదరుపడగా.. ఒక్కసారిగా రెండు వైపుల నుంచి కాల్పుల మోత మోగింది. సుమారు గంటన్నర పాటు కొనసాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం బీజాపూర్ (Bijapur) జిల్లా హెడ్ క్వార్టర్స్ (Head Quarter) నుంచి సుమారు 130 కి.మీ. దూరంలో ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది.