వణుకు పుట్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. మునుపటికంటే డేంజరస్ అంటున్న సైంటిస్టులు

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వేరియంట్ మునుపటికంటే ప్రమాదకరమని సైంటిస్టులు చెబుతుండడం మరింత కలవరపెడుతోంది.

Update: 2024-09-20 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వేరియంట్ మునుపటికంటే ప్రమాదకరమని సైంటిస్టులు చెబుతుండడం మరింత కలవరపెడుతోంది. తాజాగా మెడికల్ ఎక్స్‌పర్ట్స్ కోవిడ్19 XEC వేరియంట్‌ (Covid 19 XEC)ని కనుగొన్నారు. ఈ వేరియంట్ తొలిసారిగా జర్మనీ (Germany)లో బయటపడింది. ఆ తర్వాత యూరోపియన్ దేశాలలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. భవిష్యత్తులో ఈ వేరియంట్ ప్రభావం మరింత పెరుగుతుందని, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ వేరియంట్ లక్షణాలు (Symptoms) మునుపటి స్ట్రెయిన్ల మాదిరిగానే ఉన్నా.. గతంతో పోలిస్తే మరింత వేగంగా స్ప్రెడ్ (Spread) అయ్యే ఛాన్స్ ఉంటుందని, మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, దీనికి ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.



Similar News