Sunita Williams: అంతరిక్షంలో సునితా విలియమ్స్ పుట్టినరోజు వేడుకలు

అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్.. స్పేస్ లోనే తన 59వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.

Update: 2024-09-20 08:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్.. స్పేస్ లోనే తన 59వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 19 ఆమె బర్త్ డే కాగా.. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్పేస్ స్టేషన్ లోనే పుట్టినరోజు నిర్వహించుకున్నారు. బర్త్ డే నాడు ఆమె బిజీ షెడ్యూల్ తో గడిపారు. మరో ఆస్ట్రోనాట్ విల్ మోర్ తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను శుభ్రం చేసుకున్నారు. స్మోక్‌డిటెక్టర్ల పనితీరును పరీక్షించారు. ఇదంతా రొటీన్‌ పనే అయినప్పటికీ.. ఐఎస్‌ఎస్‌ (ISS)లో ఉన్నవారి ఆరోగ్యం, భద్రతకు చాలా కీలకం. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో సునితా విలియమ్స్, మిల్ మోర్ పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా స్పేస్ స్టేషన్ సిబ్బంది, గ్రౌండ్ కంట్రోల్ మధ్య నిరంతర సహకారాన్ని హైలైట్ చేస్తూ, కొనసాగుతున్న మిషన్ లక్ష్యాలు, రాబోయే పనులను బృందం చర్చించింది. ఆతర్వాత కొలంబస్ లాబొరేటరీ మాడ్యూల్ లోపల కార్గోను నిర్వహించడంలో సునితా సహాయపడ్డారు. ఇకపోతే అంతరిక్షంలోనే బర్త్ డే చేసుకోవడం సునితా విలియమ్స్ కు ఇది రెండోసారి. గతంలో 2012లోనూ ఆమె తన పుట్టినరోజున మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు.

8 రోజుల మిషన్ కోసం..

8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్‌ జూన్‌ 6న బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు సునితా విలియమ్స్, విల్ మోర్ వెళ్లారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సిఉండగా.. స్పేస్ షిప్ లోని హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించిన బోయింగ్‌.. ఆస్ట్రోనాట్స్ ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్‌ సురక్షితమే అని చెప్పింది. కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్‌ న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌లో సురక్షితంగా కిందకు దిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునితా, విల్ మోర్ స్పేస్ స్టేషన్ లోనే ఉండనున్నారు.


Similar News