PM Modi: రేపటి నుంచి బ్రూనైలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి రెండు రోజుల పాటు బ్రూనైలో పర్యటించనున్నారు.

Update: 2024-09-02 19:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి రెండు రోజుల పాటు బ్రూనైలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మోడీ బ్రూనై పర్యటనకు వెళ్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా  బ్రూనై సుల్తాన్ "హాజీ హస్సనల్ బోల్కియా" ఆహ్వానం మేరకు ప్రధాని సెప్టెంబర్ 3-4 తేదీల్లో బ్రూనైలో పర్యటించనున్నారు.ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో సుల్తాన్ హసనాల్ ఒకరు. అతని సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంది.అతనికి దాదాపు 7,000 కార్లు ఉన్నాయి. వీటిలో 300 ఫెరారీలు అలాగే 500 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అయితే బ్రూనైలో భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి అని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు.

భారతదేశం- బ్రూనై మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ సంవత్సరానికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. బ్రూనైతో సంబంధాలు, సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని మోడీ బ్రూనై పర్యటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ తెలిపారు. కాగా బ్రూనైలో దాదాపు 14 వేల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు.మోదీ బ్రూనై పర్యటన తర్వాత సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 4-5 తేదీలలో ఆ దేశంలో పర్యటించనున్నారు.మోడీ తన సింగపూర్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ కానున్నారు. అలాగే ఈ పర్యటనలో సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్తలతో కూడా మోడీ మీట్ అవ్వనున్నారు. 


Similar News